అల వైకుంఠపురములో 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ – నాన్ బాహుబలి రికార్డ్ కైవసంఅల వైకుంఠపురములో 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ - నాన్ బాహుబలి రికార్డ్ కైవసం
అల వైకుంఠపురములో 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ – నాన్ బాహుబలి రికార్డ్ కైవసం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం అల వైకుంఠపురములో డీసెంట్ టాక్ తో మొదలై.. యూత్, ఫ్యామిలీ, మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సీజన్ లో విడుదలైన చిత్రాల్లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు షేర్స్ ను అలవోకగా దాటేసింది. సరిలేరు 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ను అల వైకుంఠపురములో 10 రోజుల్లోనే క్రాస్ చేసింది. ఇప్పుడు 11 రోజుల కలెక్షన్స్ తో సైరా లైఫ్ టైమ్ వసూళ్లను క్రాస్ చేసి నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది.

బాహుబలి 2, బాహుబలి 1 తర్వాత తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అల వైకుంఠపురములో నిలిచింది. బుధవారం కూడా ఈ చిత్రం 2.5 కోట్ల వసూళ్లు సాధించి టోటల్ కలెక్షన్స్ ను 105.82 కోట్లకు తీసుకెళ్లింది. ప్రస్తుతం అల వైకుంఠపురములో టాప్ 3 లో ఉండగా, సరిలేరు నీకెవ్వరు టాప్ 4 ను సాధించింది.

అల వైకుంఠపురములో 11 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం : 34.36 కోట్లు
సీడెడ్ : 15.81 కోట్లు
గుంటూరు : 9.63 కోట్లు
ఉత్తరాంధ్ర : 15.99 కోట్లు
తూర్పు గోదావరి : 9.46 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.38 కోట్లు
కృష్ణ : 9.34 కోట్లు
నెల్లూరు : 3.85 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 105.82 కోట్లు

యూఎస్ లో కూడా అల వైకుంఠపురములో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే 3 మిలియన్ డాలర్ మార్క్ ను దాటిన ఈ చిత్రం భరత్ అనే నేను, రంగస్థలం కలెక్షన్స్ కు ఎసరు పెట్టేలా ఉంది. మరికొన్ని రోజుల్లో అది కూడా జరగడం ఖాయం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటించిన సంగతి తెల్సిందే.