అల వైకుంఠపురములో 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Ala Vaikunthapuramulo 15 days box office collections report
Ala Vaikunthapuramulo 15 days box office collections report

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ఈ సంక్రాంతికి జనవరి 12న విడుదలైన చిత్రం అల వైకుంఠపురములో. మొదటి నుండి డీసెంట్ గా షో మొదలుపెట్టిన ఈ చిత్రం రాను రాను కలెక్షన్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ సంక్రాంతి విన్నర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డులకు ఎసరు పెడుతోంది. అల్లు అర్జున్ బంటు పాత్రలో నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విడుదలైన దగ్గరనుండి ఎక్కడా ఈ చిత్ర కలెక్షన్స్ స్లో అవ్వలేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రం బాహుబలి 1 రికార్డును కొల్లగొట్టింది. ఆదివారం నాడు కలెక్షన్స్ మరింత గ్రోత్ కనపడి నాలుగు కోట్ల పైన షేర్ సాధించి మరింత పట్టును సాధించింది. సెకండ్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం.

15 రోజుల్లో అల వైకుంఠపురములో దాదాపు 116 కోట్లకు పైన షేర్ సాధించింది. చూస్తుంటే ఈ చిత్రం ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు.

అల వైకుంఠపురములో 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం : 38.32 కోట్లు
సీడెడ్ : 17.43 కోట్లు
గుంటూరు : 10.39 కోట్లు
ఉత్తరాంధ్ర : 17.62 కోట్లు
తూర్పు గోదావరి : 10.41 కోట్లు
పశ్చిమ గోదావరి : 8.04 కోట్లు
కృష్ణా : 9.99 కోట్లు
నెల్లూరు : 4.24 కోట్లు

15 డేస్ మొత్తం షేర్ : 116.44 కోట్లు

ప్రస్తుతం టాప్ 4 కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాల లిస్ట్ చూసుకుంటే:

బాహుబలి 2(198.7 కోట్లు)

అల వైకుంఠపురములో (116.44 కోట్లు)

బాహుబలి1 (110.1 కోట్లు)

సరిలేరు నీకెవ్వరు (109.98 కోట్లు)

పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటించగా మురళీ శర్మ, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, నివేతా పేతురాజ్, సునీల్, జయరాం, టబు, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.