అల వైకుంఠపురములో 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్అల వైకుంఠపురములో 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
అల వైకుంఠపురములో 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో కలెక్షన్స్ పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అటు డొమెస్టిక్, ఇటు ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అల వైకుంఠపురములో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అల వైకుంఠపురములో దెబ్బకి యూఎస్ లో మిగతా భారతీయ చిత్రాలు, ఇంగ్లీష్ సినిమాలు కూడా నెమ్మదించాయి. అక్కడ లాస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది అల వైకుంఠపురములో.

ఇక ఆంధ్ర, తెలంగాణలో కూడా అల వైకుంఠపురములో భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. 2 రోజులకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 37 కోట్ల షేర్ సాధించడం విశేషం. మొదటి రోజు 26 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి 10 కోట్ల మేర షేర్ సాధించడంతో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.

దాదాపు 88 కోట్లకు బిజినెస్ కాబడ్డ ఈ చిత్రం ఇప్పటికే 50 శాతానికి పైగా వసూళ్లను రికవర్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా ప్రయాణిస్తోంది. ఈ వారం అంతా పండగ కారణంగా అల వైకుంఠపురములో చిత్రానికి ప్లస్ కానుంది. రేపు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా విడుదల అవుతున్నా కానీ దాని ఎఫెక్ట్ ఈ చిత్రంపై ఉండేది తక్కువే. మొత్తానికి బన్నీ నా పేరు సూర్య చిత్రం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దాన్ని మైమరపించే గిఫ్ట్ తన అభిమానులకు ఇచ్చినట్లయింది.

అల వైకుంఠపురములో రెండు రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం 10.05
సీడెడ్ 5.19
నెల్లూరు 1.62
కృష్ణ 3.97
గుంటూరు 4.21
వైజాగ్ 4.54
ఈస్ట్ 4.19
వెస్ట్ గోదావరి 3.26
ఆంధ్ర+తెలంగాణ 37.03

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, జయరాం, మురళీశర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.