అల వైకుంఠపురములో 2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్అల వైకుంఠపురములో 2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్
అల వైకుంఠపురములో 2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెల్సిందే. డీసెంట్ టాక్ తో మొదలైన ఈ చిత్రం క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తూ వస్తోంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న ఈ చిత్రం 13 రోజుల్లో 109.25 కోట్లు కలెక్ట్ నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరి కెరీర్స్ లో అల వైకుంఠపురములో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఫస్ట్ 100 కోట్ల క్లబ్ చిత్రంగా అల వైకుంఠపురములో నిలిచింది.

ఫస్ట్ వీక్ తర్వాత కూడా ఈ చిత్రం తన దూకుడును కొనసాగించింది. ఈ వీకెండ్ రవితేజ నటించిన డిస్కో రాజా విడుదలైనా కానీ అల వైకుంఠపురములో ఎక్కడా స్లో అవ్వలేదు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ షోస్ లో హౌస్ ఫుల్స్ నమోదు చేస్తూ ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.

అల వైకుంఠపురములో 2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం : 36.64 కోట్లు
సీడెడ్ : 17.10 కోట్లు
గుంటూరు : 10.11 కోట్లు
ఉత్తరాంధ్ర : 17.21 కోట్లు
తూర్పు గోదావరి : 10.03 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.80 కోట్లు
కృష్ణ : 9.72 కోట్లు
నెల్లూరు : 4.08 కోట్లు

14 డేస్ మొత్తం షేర్ : 112.69 కోట్లు