అల వైకుంఠపురములో 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Ala Vaikunthapuramulo 9 days collections report
Ala Vaikunthapuramulo 9 days collections report

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెల్సిందే. పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇండియన్ మర్కెట్స్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లందరూ లాభాల్లోకి వచ్చేసారు. సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ ను ఎప్పుడో సాధించేసింది. మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల నుండే 84 కోట్ల షేర్ సాధించి దూసుకుపోయిన ఈ చిత్రం ఆదివారం నాడు 8.4 కోట్ల షేర్ సాధించిన సంగతి తెల్సిందే.

ఇక సోమవారం వర్కింగ్ డే కావడంతో స్లో అవుతుందని ట్రేడ్ పండితులు భావించారు కానీ ఆశ్చర్యకరంగా అల వైకుంఠపురములో స్ట్రాంగ్ హోల్డ్ ను సాధించింది. సోమవారం ఈ చిత్రం 5 కోట్ల పైచిలుకు షేర్ ను సాధించింది. దీంతో అల వైకుంఠపురములో టోటల్ కలెక్షన్స్ 100 కోట్ల మార్క్ కు చేరువగా వచ్చింది.

మరోవైపు యూఎస్ లో కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చోటు సంపాదించి బన్నీ, త్రివిక్రమ్ ల కెరీర్ లలో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అల వైకుంఠపురములో 9 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 31.35 కోట్లు
సీడెడ్ : 14.27 కోట్లు
గుంటూరు : 9.23 కోట్లు
ఉత్తరాంధ్ర : 14.81 కోట్లు
తూర్పు గోదావరి : 8.78 కోట్లు
పశ్చిమ గోదావరి : 6.78 కోట్లు
కృష్ణా : 8.92 కోట్లు
నెల్లూరు : 3.64 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 97.78 కోట్లు

10వ రోజుతో ఈ చిత్రం 100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేయనుంది. ఆ ఫీట్ సాధించిన ఐదో చిత్రంగా అల వైకుంఠపురములో నిలవనుంది.