అల వైకుంఠపురములో.. వచ్చేస్తోంది!


Ala vaikunthapuramulo all set for digital release
Ala vaikunthapuramulo all set for digital release

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఎంత పెద్ద హిట్టయ్యిందో మనందరం చూసాం. డీసెంట్ కలెక్షన్స్ తో మొదలైన ఈ చిత్రం సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా ఉపయోగించుకుని రోజురోజుకీ కలెక్షన్స్ మరింత పెరుగుతూ మొత్తానికి ఇండస్ట్రీ హిట్ అయింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఈ చిత్రం రికార్డ్ హిట్ గా నిలిచింది. స్టైలిష్ స్టార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కెరీర్ లలోనే ఈ సినిమా బంపర్ హిట్ గా నిలిచిన సంగతి తెల్సిందే.

అల్లు అర్జున్ ఈ సినిమా పట్ల ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. తాను కోరుకున్నది జరగడంతో ఆనందంలో తేలిపోయాడు. అటు ఫ్రెండ్స్ కు, ఇటు మీడియా వారికి పార్టీలు ఇచ్చాడు. సిల్వర్ స్క్రీన్ పై అందరినీ అలరించిన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. 50 రోజులకు దగ్గర్లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. అల వైకుంఠపురములో ఈ నెల 26 నుండి సన్ నెక్స్ట్ లో డిజిటల్ గా ప్రదర్శింపబడుతుంది.

అల వైకుంఠపురములో రిలీజ్ కు ముందు సినిమా పోస్టర్స్ పై “మీరు ఈ సినిమాను హాట్ స్టార్ లేదా ప్రైమ్ లో చూడలేరు” అని పోస్టర్స్ పై వేయడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది, ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమా రన్ కు అది దోహదపడింది. యూఎస్ లో అల వైకుంఠపురములో 3 మిలియన్ డాలర్స్ ను దాటి టాప్ 5 లో నిలిచింది ఈ చిత్రం.

డిజిటల్ రిలీజ్ విస్తృతమయ్యాక యూఎస్ లో తెలుగు సినిమాలకు గడ్డు కాలం ఎదురైన పరిస్థితి తెల్సిందే. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో ఉపయోగించిన స్ట్రాటజీ కూడా బానే వర్కౌట్ అయింది. ఇక 50 డేస్ రన్ పూర్తవుతున్న సందర్భంగా ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ కు వస్తోంది. హాట్ స్టార్ లేదా ప్రైమ్ కాకుండా ఈ చిత్రం సన్ నెక్స్ట్ లో ప్రదర్శితమవుతుండడం విశేషం. మరి డిజిటల్ రిలీజ్ లో ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.