అల వైకుంఠపురములో వెనక్కి తగ్గడానికి కారణం అదేనా?


Ala Vaikunthapuramulo backs out of promotions
Ala Vaikunthapuramulo backs out of promotions

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెల్సిందే. భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోన్న విషయం ఇప్పటికే ధృవీకరించబడింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. నివేద థామస్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టబు చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారానే తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. మురళీ శర్మ, మలయాళ నటుడు జయరాం, సునీల్.. ఇలా భారీ కాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తోంది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వర్క్స్ చాలా త్వరగానే మొదలైన విషయం తెల్సిందే. సినిమా విడుదలకు నాలుగు నెలల ముందుగానే ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేసి ప్రమోషన్స్ కు తెర తీశారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటేసింది ఈ పాట. అలాగే 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ చిత్రంలోని రెండో పాటను కూడా వదిలారు. రాములో రాముల తొలి పాటకు పోటీగా యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఈ పాట కూడా రికార్డు వ్యూస్ సాధిస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తోంది. ఈ రెండు పాటలూ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై బజ్ ఆకాశాన్నంటిన విషయం తెల్సిందే. అయితే మూడో పాట ఓ మై గాడ్ డాడీకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తొలి రెండు పాటలు నెలకొల్పిన అంచనాలను మాత్రం ఈ పాట అందుకోలేకపోయిందన్నది నిజం. ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ తో అల వైకుంఠపురములో టీమ్ మళ్ళీ ఆలోచనలో పడింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ చిత్ర టీజర్ ను డిసెంబర్ ఫస్ట్ కి విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ ఫస్ట్ కు అన్నారు కానీ అదేం జరగలేదు. ఫస్ట్ వీక్ లో చేస్తారన్న అప్డేట్ కూడా ఇంతవరకూ ఏం రాలేదు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు, క్రిస్మస్ కు విడుదలయ్యే సినిమాలు అన్నీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రమోషన్స్ చేపట్టినా కానీ అల వైకుంఠపురములో టీమ్ మాత్రం ఈసారి కంగారు పడాలని అనుకోవట్లేదు.

ముందు షూటింగ్ ను సజావుగా పూర్తి చేసి అప్పుడే ప్రమోషన్స్ కు వెళ్లాలని భావిస్తోంది. డిసెంబర్ సెకండ్ వీక్ కు షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశాలున్న నేపథ్యంలో దాని తర్వాతే టీజర్ రిలీజ్ ఉంటుందన్నమాట. మొత్తానికి మొదట్లో విపరీతంగా ప్రమోషన్స్ చేపట్టిన అల వైకుంఠపురములో టీమ్ ఇప్పుడు ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది.