3 మిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టేసిన అల వైకుంఠపురములో


Ala Vaikunthapuramulo crosses 3 million dollar mark in US
Ala Vaikunthapuramulo crosses 3 million dollar mark in US

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో కలెక్షన్స్ అందరి అంచనాలను దాటుకుంటూ దూసుకుపోతోంది. రోజులు గడుస్తున్నా, సంక్రాంతి సెలవులు ముగిసినా, వర్కింగ్ డేస్ మొదలైనా అల వైకుంఠపురములో మాత్రం ఎక్కడా స్లో అవ్వట్లేదు. నిన్న మెగాస్టార్ సైరా రికార్డులకు ఎసరు పెట్టిన అల.. ఈరోజు శ్రీమంతుడు కలెక్షన్స్ ను దాటి ఆల్ టైమ్ టాప్ 5 లో దర్జాగా సెటిలైంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి చిత్రం అల వైకుంఠపురములో. ఇప్పటివరకూ కనీసం 1.5 మిలియన్ డాలర్ మార్క్ ను కూడా టచ్ చేయలేదు బన్నీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మూడు 2 మిలియన్ డాలర్ సినిమాలు ఉన్నా 3 మిలియన్ సాధించిన తొలి చిత్రమిదే.

ఆదివారం నాటికి అల వైకుంఠపురములో ఈ ఫీట్ ను అందుకుంది. ఇప్పటివరకూ బాహుబలి 2, బాహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు మాత్రమే ఈ ఫీట్ ను సాధించాయి. సాహో చిత్రానికి 3.2 మిలియన్ డాలర్లు వచ్చినా అది అన్ని భాషలను కలుపుకుంటే వచ్చిన అమౌంట్.

10 రోజులు పూర్తయినా కానీ అల వైకుంఠపురములో ఎక్కడా స్లో అయ్యేలా కనిపించట్లేదు. ఫుల్ రన్ లో ఈ చిత్రం రంగస్థలం, భరత్ అనే నేను కలెక్షన్స్ ను సగర్వంగా క్రాస్ చేస్తుందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. సో యూఎస్ లో కూడా నాన్ బాహుబలి రికార్డులు అల్లు అర్జున్ పేరిట నమోదవ్వబోతున్నాయన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా అల వైకుంఠపురములో తనదైన శైలి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 9 రోజుల కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ ను చేరువగా వచ్చింది. బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ షేర్ సాధించిన చిత్రంగా అల వైకుంఠపురములో నిలిచింది.