‘అల’ అరాచకాలు ఆగట్లేదుగా! 

Ala Vaikunthapuramulo crosses 40 Cr mark in Nizam
Ala Vaikunthapuramulo crosses 40 Cr mark in Nizam

అల వైకుంఠపురములో మొదట డీసెంట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ కూడా బాగా వస్తుంటే సీజన్ అడ్వాంటేజ్ అనుకున్నారు. ఆ తర్వాత వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ కుమ్మేస్తుంటే కాంబినేషన్ క్రేజ్ కలిసొచ్చిందని అన్నారు. అయితే రెండు వారాలు పూర్తై కొత్త సినిమాలు విడుదలవుతున్నా కూడా ఎక్కడా అల వైకుంఠపురములో తగ్గట్లేదు. తగ్గేలా కూడా కనిపించట్లేదు. ఏరియాలతో సంబంధం లేకుండా అల వైకుంఠపురములో పెర్ఫార్మ్ చేస్తున్న తీరుకి ట్రేడ్ పండితులు కూడా విస్తుపోతున్నారు. దీన్ని ఏ రకమైన బ్లాక్ బస్టర్ అనాలో కూడా వారికి అర్ధం కావడం లేదు.

ముందుగా అల వైకుంఠపురములో ఓవర్సీస్ రికార్డు గురించి మాట్లాడుకుంటే.. నిన్న ఆదివారం దాదాపు 50 వేల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం భరత్ అనే నేను లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటి నాలుగో స్థానంలో స్థిరంగా నిలబడింది. మరో రెండు, మూడు రోజుల్లో రంగస్థలం రికార్డులకు కూడా ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. 3.5 మిలియన్ డాలర్ మార్క్ కు అతి చేరువగా వచ్చింది ఈ చిత్రం.

ఇప్పుడు అల వైకుంఠపురములో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డును తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం బాహుబలి 1 కలెక్షన్స్ ను కూడా దాటేలా కనిపిస్తోంది. ఇక నైజాంలో ఈ చిత్రం భీభత్సం సృష్టించింది. నిన్న 2 కోట్ల పైన షేర్ వసూలు చేసిన ఈ చిత్రం నైజాంలో 40 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత నైజాంలో ఈ మార్క్ కు చేరుకున్న తొలి చిత్రంగా అల వైకుంఠపురములో నిలిచింది. ఇప్పటికే 40 శాతానికి పైగా లాభాలను జేబులో వేసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు మరింత ఆనందంలో ఉన్నాడు. వైజాగ్, సీడెడ్ లో కూడా ఈ చిత్రం భారీ లాభాలను మూటగట్టుకుంది. అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ లోకి వెళ్లి క్లీన్ బ్లాక్ బస్టర్ గా స్థానం సంపాదించుకుంది అల వైకుంఠపురములో.