అల వైకుంఠపురములో క్రేజ్ కు నిదర్శనమిదిగో


అల వైకుంఠపురములో క్రేజ్ కు నిదర్శనమిదిగో
అల వైకుంఠపురములో క్రేజ్ కు నిదర్శనమిదిగో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ గా వచ్చిన అల వైకుంఠపురములో ఈ జనవరి 12న విడుదలై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో అల వైకుంఠపురములో సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

పోటీగా సరిలేరు నీకెవ్వరు ఉన్నా కానీ కంపేర్ చేసుకుంటే అల వైకుంఠపురములో చిత్రానికే బెటర్ టాక్ ఉంది. దీంతో ప్రేక్షకుల్లో అల వైకుంఠపురములో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయింది. పండగ సందర్భంగా అందరూ రెండు సినిమాలు చూడటానికి ఇష్టపడతారు కానీ మొదట మాత్రం డిమాండ్ అల వైకుంఠపురములో చిత్రానికే ఉంది.

అల వైకుంఠపురములో పండగ రెండు రోజులకూ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. దాదాపు 96 శాతం హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది అల వైకుంఠపురములో. సరిలేరు నీకెవ్వరు కూడా తక్కువగా ఏం లేదు. దీనికి కూడా దాదాపు 82 శాతం హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో థియేటర్లు పంచుకోవాల్సి రావడంతో అల వైకుంఠపురములో డిమాండ్ కు తగ్గట్లుగా థియేటర్లు అందుబాటులో లేవు. అందుకే ఎర్లీ మార్నింగ్ షోస్ ను ఈ చిత్రానికి కంటిన్యూ చేస్తున్నారు. సాధారణంగా వారం పాటు ఎర్లీ మార్నింగ్ షోస్ కు పెర్మిషన్ తీసుకున్నా కానీ మహా అయితే రెండు రోజుల పాటు ఈ షోస్ కొనసాగుతాయి కానీ అల వైకుంఠపురములో చిత్రానికి ఉన్న డిమాండ్ ను మీట్ అవ్వడానికి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎర్లీ మార్నింగ్ షోస్ ను కొనసాగిస్తున్నారు. ఇవి ఆదివారం వరకూ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.