సరిలేరు కన్నా ఎక్కువ రేటు పలుకుతున్న వైకుంఠపురములో..


Ala Vaikunthapuramulo gets more price for hindi dubbing rights than Sarileru Neekevvaru
Ala Vaikunthapuramulo gets more price for hindi dubbing rights than Sarileru Neekevvaru

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నాయి అని ఏ క్షణాన ప్రకటించారో కానీ అప్పటినుండి ప్రతి విషయంలోనూ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ వస్తూనే ఉంది. ఈ చిత్రానికి ఇలా జరిగింది అంటే ఈ చిత్రానికి అలా జరిగింది అంటూ ఏవేవో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రమోషన్స్ విషయంలో చూస్తే అల వైకుంఠపురములో చిత్రానికి క్లియర్ ఎడ్జ్ ఉంది. ఈ చిత్రంలో నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసారు. మూడో పాటను విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అందించడంలో కూడా చాలా ముందున్నారు. చిత్రం గురించి ఏ క్షణాన ఏం జరుగుతోందో ఆడియన్స్ కు తెలిసేలా నిత్యం టచ్ లో ఉంచుతున్నారు. ఇది అల వైకుంఠపురములో చిత్రానికి చాలా హెల్ప్ అయింది. ఎన్నడూ లేని స్థాయిలో బజ్ ఉంది ఈ చిత్రంపై.

ప్రేక్షకుల్లో బజ్ సంగతి సరే. మరి మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉంది. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అన్న సందేహాలు మీకు వచ్చి ఉంటే ఇదిగో ఇదే సమాధానం. ట్రేడ్ వర్గాల్లో కూడా అల వైకుంఠపురములో మీదే ఆకర్షణ ఎక్కువగా ఉంది.కాంబినేషన్ క్రేజ్ ఒకటి కారణమైతే ఈ చిత్రం మీద యూనిట్ సభ్యులు ప్రదర్శిస్తోన్న కాన్ఫిడెన్స్ మరొక కారణం. మొత్తంగా అల వైకుంఠపురములో చూస్తుంటే హిట్ కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇక ట్రేడ్ వర్గాల విషయంలోకి వెళితే సరిలేరు నీకెవ్వరు హిందీ సాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ కలిపి కేవలం 15 కోట్లు మాత్రం పలికిందిట. మహేష్ గత చిత్రాలు ఇవే రైట్స్ కు 20 కోట్లు పలకడంతో మార్కెట్ డౌన్ లో ఉంది అనుకున్నారు. కానీ అల వైకుంఠపురములో చిత్రం ఇవే రైట్స్ ను 19.5 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే మార్కెట్ డౌన్ లో లేదు. ప్రమోషన్స్ లేక సరిలేరు డౌన్ లో ఉంది. మరి మహేష్ అండ్ కో ఇది వింటున్నారో లేదో.