అల ప్యారీస్ వెళ్లనున్న వైకుంఠ౦……


Ala Vikuntapuramlo
అల ప్యారీస్ వెళ్లనున్న వైకుంఠ౦……

ఈ రోజుల్లో ఎవర్ని అయిన పట్టుకొని ఏమైన అడిగితే , ఎవరైతే అడిగిన వాళ్లకి సమాధానం గురించి వివరంగా చెప్తే, ఆ బదులు సమాధానం చెప్పిన వాళ్ళని జనాలు ఏమంటారు? అలంటి సమాధానం దగ్గర మాటలు పెట్టేసి, బదులు సమాధానం చెప్పిన వాళ్ళని డైరెక్టర్ అనగానే మనకి వెంటనే గుర్తుకి వచ్చే పేరు గాని, మదిలో నిలిచే పేరు గాని ఒక్కరు మాత్రమే వుంటారు అది “త్రివిక్రమ్ శ్రీనివాస్” గారు.

ఆయనవి వొట్టి మాటలు కాదు, ఆయన సినిమాలు ఒక తపస్సు, పాతకాలంలో ఋషులు బాగా జపం చేసి దేవుడి దివ్య దర్శనాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు అని మనం కథలు విన్నాం. ఆ కథలకి, నేను చెప్పే మాటలకి చిరునామా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆయన సినిమాలని జనాలు సినిమాల లాగ అస్సలు చూడరు, అందుకే ఆయనకి “మాటల మాంత్రికుడు” అని కితాబులిచ్చేవారు. ఇంతకీ అసలు విషయానికి వొస్తే త్రివిక్రమ్ గారు ఇప్పుడు స్టార్ (స్టైలిష్) హీరో అయిన “అల్లు అర్జున్” తొ “అల వైకుంఠపురం లొ” అని సినిమా చేస్తున్నాడు అని, ఆ సినిమా నుండి చిన్న టీజర్ ని కూడా చూడడం జరిగింది, “ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్, ఇవ్వళా ఒచ్చింది” అని మాట కూడా విన్నాం, ఆ మాట కూడా ఇప్పుడు ఎక్కడవిన్న, ఎక్కడ చూసిన అదే ట్రెండింగ్ లో నడుస్తుంది అంటే అది ఆయనకి వున్న ఆధరణ.

ఆ సినిమా ట్రైలర్ దసరా కానుకగా రిలీజ్ అవుతుంది అని కూడ విన్నాం, కానీ కొత్తగా ఇప్పుడు ఈ సినిమా మన ఇండియా నుండి వేరొక ప్రాంతానికి వెళుతుంది అని చిత్ర యూనిట్ నుండి ప్రకటన వచ్చింది, అది ఏంటంటే యూనిట్ ఇప్పుడు ప్యారీస్ వెళ్లనుంది. ప్యారీస్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ల్లి ఇండియా రానున్న చిత్ర యూనిట్ కి ముందుగ అబినందనలు.