అల వైకుంఠపురములో వేడి ఇంకా చల్లారలేదుగా


Ala Vaikunthapuramulo phenomenal run continues
Ala Vaikunthapuramulo phenomenal run continues

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లాస్ట్ సినిమా అల వైకుంఠపురములో విడుదలై ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం విడుదలైన దగ్గరనుండి ఎన్ని రికార్డులను తిరగరాసిందో మరిన్ని కొత్తవి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రం 100 కోట్ల షేర్ ను దాటింది. ఓవర్సీస్ లో 3 మిలియన్ ను కూడా దాటింది. మొత్తంగా నాన్ బాహుబలి 2 రికార్డును సైతం కైవసం చేసుకుంది. 50 రోజులు పూర్తవకుండానే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో దర్శనమిచ్చిన సంగతి తెల్సిందే. రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అల వైకుంఠపురములో స్ట్రీమ్ అవుతోంది.

సాధారణంగా డిజిటల్ రిలీజ్ అయ్యాక ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ తగ్గిపోతుంది. పూర్తిగా డౌన్ అయిపోతుంది. అయితే అల వైకుంఠపురములో విషయంలో మాత్రం అలా జరగట్లేదు. ఈ సినిమా రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నా సరే ఇంకా థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో ఆడుతున్న అన్ని చిత్రాల్లోకి బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతోంది. గత వారం, ఆ ముందు వారం విడుదలైన చిత్రాల కంటే సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో ఎక్కువ వసూళ్లు సాధించడం నిజంగా మామూలు ఫీట్ కాదు. జనాలు ఈ చిత్రాన్ని ఎంతలా ఆదరిస్తున్నారో తెలిపే ఘనత ఇది. ట్రేడ్ పండితులు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్ల షేర్ మార్క్ ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా 80 శాతం లాభాలు బయ్యర్లు అందుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక కాగా ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.