అల వైకుంఠపురములో సక్సెస్ భీష్మకు కలిసొచ్చింది


అల వైకుంఠపురములో సక్సెస్ భీష్మకు కలిసొచ్చింది
అల వైకుంఠపురములో సక్సెస్ భీష్మకు కలిసొచ్చింది

ఒక సినిమా సక్సెస్ అయిందంటే అది డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా చాలా మందికి చాలా విషయాల్లో హెల్ప్ అవుతుంటుంది. ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న అల వైకుంఠపురములో చిత్రం సాధించిన భారీ సక్సెస్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ను ఒడ్డున పడేసింది. ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు అందరూ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా సాధించిన సక్సెస్ భీష్మకు హెల్ప్ అవుతోంది. నితిన్ నటిస్తోన్న ఈ సినిమా హారిక అండ్ హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి మొదటి నుండీ బయ్యర్లలో మంచి రెస్పాన్స్ ఉంది. టీజర్ ఆకట్టుకోవడం, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా బాగుండడంతో భీష్మపై మొదటి నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు అల వైకుంఠపురములో సక్సెస్ ట్రేడ్ పరంగా మరింత బూస్ట్ ను అందించింది. బ్యానర్ పై ఉన్న నమ్మకంతో భీష్మ చిత్రానికి ఇప్పుడు ట్రేడ్ పరంగా ఫుల్ డిమాండ్ ఉంది. భీష్మను కొనడానికి బయ్యర్లు ఎగబడుతుండడంతో నిర్మాణ సంస్థ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

నితిన్ ఇప్పుడు వరస ప్లాపుల్లో ఉన్నాడు. అతను నటించిన లాస్ట్ మూడు సినిమాలు దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. పైగా గతేడాది నితిన్ నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. నితిన్, రష్మిక కెమిస్ట్రీలో ఈ సినిమాకు బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ గా నిలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛలో దర్శకుడు వెంకీ కుడుములు తెరకెక్కించాడు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి ఆఫ్ సీజన్ అయినా కూడా ట్రేడ్ ఎక్కడా వెనుకంజ వేయకపోవడం గమనార్హం. ఒక ఆఫ్ సీజన్ చిత్రానికి కూడా డిమాండ్ ఈ రేంజ్ లో ఉండడం విశేషమే. మహతి సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నితిన్ ను మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందని కోరుకుందాం.