యూఎస్ లో బన్నీ హంగామా, మహేష్ డౌటే


 Ala Vaikunthapuramulo to reach safe zone in us while sarileru doubt
Ala Vaikunthapuramulo to reach safe zone in us while sarileru doubt

యూఎస్ మార్కెట్ అనగానే గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ హీరో నటించిన ఏ చిత్రమైనా టాక్ తో సంబంధం లేకుండా 1 మిలియన్ డాలర్ ను మార్క్ ను చేరుకుంటాయి. అయితే మొదట్లో మహేష్ బాబు సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో భారీ రేట్లకు మహేష్ చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కు కొంచెం దూరంలో వచ్చి ఆగిపోతుండేవి. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం దీనికి ఉదాహరణ. ఈ చిత్రాన్ని యూఎస్ లో 3 మిలియన్ డాలర్ కు బిజినెస్ చేసారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం యూఎస్ లో 2 మిలియన్ డాలర్ మార్క్ కు కొంచెం దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు విషయంలో కూడా ఇదే జరిగేలా ఉంది. దీనికి కూడా యూఎస్ లో 3 మిలియన్ డాలర్ బిజినెస్ జరిగింది.

ఈ చిత్రం మొదట్లో ఇక్కడ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే నిన్న ఈ చిత్ర కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. 164 లొకేషన్స్ నుండి ఈ చిత్రం $32,560 ను వసూలు చేసింది. దీంతో మొత్తం $1,825,558. దీంతో ఫుల్ రన్ 2 మిలియన్ డాలర్స్ ను దాటేలా కనిపిస్తోంది కానీ 3 మిలియన్ మార్క్ ను చేరుకోవడం దాదాపు అసాధ్యం.

మరోవైపు బన్నీ చిత్రం ఇక్కడ బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అల వైకుంఠపురములో యూఎస్ లో 2 మిలియన్ డాలర్ బిజినెస్ చేసింది. నిన్నటితో ఈ చిత్రం $1,882,973 సాధించింది. ఇంకా అక్కడ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. 147 లొకేషన్స్ లో నిన్న ఒక్క రోజే ఈ చిత్రం $102,160 సాధించింది. చూస్తుంటే ఫుల్ రన్ లో 3 మిలియన్ డాలర్ వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్ అల వైకుంఠపురములో కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.