ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అరుదైన రికార్డు సాధించిన బన్నీ


ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అరుదైన రికార్డు సాధించిన బన్నీ
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అరుదైన రికార్డు సాధించిన బన్నీ

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ను సినిమా హబ్ గా పేర్కొంటారు. ఇదే ఏరియాలో ఉన్న 9 థియేటర్ల కలెక్షన్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా ట్రాకింగ్ ఉంటుంది. ఇక్కడి నుండి వచ్చే టాక్ ను సినిమా వాళ్ళు చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తారు. ఇక్కడి రికార్డులను కూడా ఫ్యాన్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇంతటి చరిత్ర ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలో సంక్రాంతి సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు గొప్పగా పెర్ఫార్మ్ చేసాయి. ఇప్పటికే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అక్కడ 1 కోటి రూపాయల కలెక్షన్ సాధించగా తాజాగా అల వైకుంఠపురములో ఈ మార్క్ కు చేరువైంది. తద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి కలెక్షన్ సాధించిన నాలుగో బన్నీ సినిమాగా అల వైకుంఠపురములో నిలిచింది.

ఈరోజు నుండి ఈ రెండు చిత్రాలకు అసలైన పరీక్ష మొదలుకానుంది. అయితే ఇప్పటికే ఈ రెండు చిత్రాలను కొన్న బయ్యర్లు సేఫ్ అవ్వడంతో ఎంత వచ్చినా బోనస్ కిందే లెక్క.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి కలెక్షన్ సాధించిన హీరోల సినిమాల వివరాలు:

వెంకటేష్ : 2 (నువ్వు నాకు నచ్చావ్, ఎఫ్ 2)

వరుణ్ తేజ్ : 2 (ఫిదా, ఎఫ్ 2)

మహేష్ బాబు : 9 (మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు)

పవన్ కళ్యాణ్ : 4 (తొలిప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది)

అల్లు అర్జున్ : 5 (ఆర్య, దేశముదురు, రేసు గుర్రం, సరైనోడు, అల వైకుంఠపురములో)

చిరంజీవి : 5 (ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నెం 150, సైరా నరసింహారెడ్డి)

ప్రభాస్ : 5 (వర్షం, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2, సాహో)

ఉదయ్ కిరణ్ : 2 (నువ్వు నేను, మనసంతా నువ్వే)

నాగార్జున : 1 (మన్మథుడు)

నందమూరి బాలకృష్ణ : 1 (నరసింహ నాయుడు)

రవితేజ : 1 (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి)