అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో పాట విడుదల వాయిదా !!!


అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో పాట విడుదల వాయిదా
అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో పాట విడుదల వాయిదా

అల్లు అర్జున్ & త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అలవైకుంఠపురంలో మూవీ లోని సామజవారగమనా బాగా పాపులర్ అయ్యింది. తరువాత త్రివిక్రమ్ బన్నీ మరో పాటతో ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి సిద్ధమయ్యారు. ‘రాములో రాములా… ‘ అని సాగే ఓ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ అక్టోబర్ 21 (సోమవారం) విడుదల కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సాంగ్ రిలీజ్ కాలేదు.

ఈ పాట రేపటికి వాయిదా వేశారు. ఇది చిత్రంలో వచ్చే పార్టీ సాంగ్. తమన్ తనదైన శైలిలో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడని వినికిడి. జగన్నాథం చిత్రం తరువాత పూజా హెగ్డే మరో మారు అలవైకుంఠపురంలో బన్నీకి హీరోయిన్ గా నటిస్తుండగా, టబు, సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నట్టు సమాచారం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చెయ్యనున్నారు.

Credit: Twitter