అల వైకుంఠపురములో 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Ala Vaikunthapurramuloo 5 days collections report
Ala Vaikunthapurramuloo 5 days collections report

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం రోజులు గడిచే కొద్దీ తన సక్సెస్ రేంజ్ ను పెంచుకుంటూ వెళ్ళిపోతోంది. విడుదలైన నాలుగో రోజున నాన్ బాహుబలి రికార్డులను మడతెట్టేసిన అల వైకుంఠపురములో ఐదో రోజున దానికి మించిన వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేసింది. సాధారణంగా సంక్రాంతి రోజున ఏ చిత్రమైనా అత్యధిక కలెక్షన్స్ ను సాధిస్తుంది. కానీ అల వైకుంఠపురములో సంక్రాంతి రోజు కంటే కనుమ రోజున ఎక్కువ కలెక్షన్స్ సాధించడం విశేషం.

మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 58.06 కోట్ల షేర్ ను సాధిస్తే, ఐదో రోజున ఏకంగా 11.57 కోట్ల షేర్ ను అందుకోవడం విశేషం. వరసగా ఐదు రోజులు డబల్ డిజిట్ షేర్ ను అందుకున్న చిత్రంగా అల వైకుంఠపురములో బాహుబలి 2 రికార్డులను సమం చేసింది. ఈరోజు కూడా డబల్ డిజిట్ షేర్ వస్తే అల్లు అర్జున్ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం.

మొత్తంగా ఐదు రోజులకు గాను ఈ చిత్రం 69.63 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. ఈస్ట్, నెల్లూరు విషయంలో తప్పితే మిగతా అన్ని రీజియన్స్ లో అల వైకుంఠపురములో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. అల వైకుంఠపురములో 65 కోట్లకు బిజినెస్ చేయబడిన విషయం తెల్సిందే. ఆదివారం వరకూ అల వైకుంఠపురములో చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్న నేపథ్యంలో సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం.

అల వైకుంఠపురములో 5 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం : 22.15 కోట్లు
సీడెడ్ : 11.17 కోట్లు
గుంటూరు : 6.79 కోట్లు
ఉత్తరాంధ్ర : 9.72 కోట్లు
తూర్పు గోదావరి : 6.1 కోట్లు
పశ్చిమ గోదావరి : 4.7 కోట్లు
కృష్ణ : 6.31 కోట్లు
నెల్లూరు : 2.69 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 69.63 కోట్లు