`అల వైకుంఠ‌పుర‌ములో` ర‌న్‌టైమ్ లాక్ చేశారు!


`అల వైకుంఠ‌పుర‌ములో` ర‌న్‌టైమ్ లాక్ చేశారు!
`అల వైకుంఠ‌పుర‌ములో` ర‌న్‌టైమ్ లాక్ చేశారు!

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున‌న క్రేజీ ఎంట‌ర్‌టైన‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి బ‌రిలో బ‌ల‌మైన పోటీనివ్వ‌బోతోంది. ఎస్‌. రాధాకృష్ణ, ఏస్ ప్రొడ్యూస‌ర్‌ అల్లు అర‌వింద్ తొలిసారి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం జ‌రిగిన మ్యూజిక్ కాన్సెర్ట్ అట్ట‌హాసంగా జరిగింది. సినిమాకు ప‌నిచేసిన మ్యూజీషియ‌న్స్ డేగా ఈ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నెవ‌ర్ బిఫోర్ నెవ‌ర్ ఆప్ట‌ర్ అన్న‌ట్టుగా మేక‌ర్స్ నిర్వ‌హించ‌డం ప‌లువురిని విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఇదే వేడుక‌లో పాల్గొన్నస్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై ఏ స్థాయి కాన్ఫిడెన్స్‌తో వున్నారో ఆయ‌న మాట‌ల్లో తెలిసిపోయింది. ఇక ఇదే వేదిక‌పై నుంచి రిలీజ్ చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. త్రివిక్ర‌మ్ మార్కు మాయాజాలంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం క‌నిపించ‌డం లేదు. అల్లు అర్జున్ క్యారెక్ట‌రైజేష‌న్‌, ట్రైల‌ర్‌లో `మీరు ఇప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కేసా..` అంటూ అల్లు అర్జున్ చెబుతున్న‌ డైలాగ్స్ సినిమా ఏలా వుండ‌బోతోందో హింట్ ఇచ్చేస్తున్నాయి.

మంగ‌ళ‌వారం ఈ సినిమా సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. రన్ టైమ్‌ని 165 (2 గంట‌ల 45 నిమిషాలు) నిమిషాల‌కు లాక్ చేసేశారు, ముందు నిడివి మూడు గంట‌లు అనుకున్నార‌ట‌. అయితే నిడివి మ‌రీ ఎక్కువైపోతుంద‌ని భావించి చివ‌రికి 2:45 నిమిషాల‌కు ర‌న్ టైమ్‌ని లాక్ చేసిన‌ట్టు తెలిసింది. పూర్తి స్థాయి వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అల్లు అర్జున్‌, త్ర‌విక్ర‌మ్‌ల కెరీర్‌లోనే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Credit: Twitter