19న‌ అంబ‌రాన్నంటే  `అల..`  సంబ‌రం!


Ala vaikutapuramulo success celebretions at vizag
Ala vaikutapuramulo success celebretions at vizag

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` ఈ నెల 12న విడుద‌లై తొలి రోజు తొలి షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల‌తో తొలి రికార్డుని న‌మోదు చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సంక్రాంతి విన్న‌ర్ అంటూ హంగామా చేస్తున్న ఈ చిత్ర టీమ్ ఈ నెల 19న వైజాగ్‌లో అంబ‌రాన్నంటే సంబ‌రాన్ని చేయ‌బోతున్నారు.

ముందు ఈ నెల 18నే ఈ కార్య‌క్ర‌మాన్ని భారీగా నిర్వ‌హించాల‌ని అల్లు అర‌వింద్ మీడియా ముఖంగా ప్ర‌క‌టించారు కానీ ఎందుకో ఆ డేట్ ఒక రోజు వెన‌క్కి వెళ్లింది. వైజాగ్‌లో సాయంత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ హంగామా ప్రారంభించ‌బోతున్నారు. మ‌రో రెండు రెండు రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో చిత్ర బృందం ఏర్పాట్ల‌లో మునిగిపోయారు.

ఇండియా వైజ్‌గా ఐదు రోజుల‌కు గానూ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో క‌లిపి ఇప్ప‌టికే వంద కోట్లు దాటింద‌ని, వ‌ర‌ల్డ్ వైడ్‌గా మ‌రో రెండు రోజుల్లో 140 కోట్ల‌కు చేరుకునే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.