అమ‌లాపాల్ విడాకుల‌కు ధ‌నుష్ కార‌ణ‌మా?

అమ‌లాపాల్ విడాకుల‌కు ధ‌నుష్ కార‌ణ‌మా?
అమ‌లాపాల్ విడాకుల‌కు ధ‌నుష్ కార‌ణ‌మా?

త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌. విజ‌య్‌, హీరోయిన్ అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఆ వెంట‌నే ఇద్ద‌రు విడాకులు తీసుకుని విడిపోవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. విడిపోయిన త‌రువాత ఈ కార‌ణం వ‌ల్ల విడిపోయామ‌ని, అమ‌లాపాల్‌, ఈ రీజ‌న్ వ‌ల్లనే అమ‌ల‌కు విడాకులు ఇచ్చాన‌ని ఎ.ఎల్‌. విజ‌య్ వెల్ల‌డించ‌లేదు.

విడిపోయిన ఇద్ద‌రు కెరీర్ ప‌రంగా బిజీగా వుంటున్నారు, వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అమ‌లాపాల్ బిజీగా మానితే ఏ.ఎల్‌. విజ‌య్ కూడా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా గ‌డిపేస్తున్నారు. అయితే తాజాగా వీరిద్ద‌రు విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ధ‌నుష్ అని ఎ.ఎల్‌. విజ‌య్ ఫాంద‌ర్ అళ‌గ‌ప్ప‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు కోలీవుడ్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి,

అమ‌లాపాల్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం విజ‌య్‌కి ఇష్టం లేద‌ని, కానీ ధ‌నుష్ కార‌ణంగా అమ‌ల మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టింద‌ని అదే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా మార‌డంతో ఇద్ద‌రు విడాకులు తీసుకున్నార‌ని, కాబ‌ట్టి వారిని విడదీసింది ధ‌నుషేన‌ని అళ‌గ‌ప్ప‌న్ కొత్త కాంట్ర‌వ‌ర్సీకి తెర‌లేప‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.