అలీ కి లక్కీ ఛాన్స్


హాస్య నటుడు అలీ కి ఇన్నాళ్లకు లక్కీ ఛాన్స్ వచ్చింది . బాలీవుడ్ సినిమాలో అందునా సల్మాన్ ఖాన్ హీరోగా నటించే సినిమాలో ఛాన్స్ లభించింది . టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా సత్తా చాటిన అలీ పలు చిత్రాల్లో హీరోగా నటించాడు కూడా . అలీ బాలనటుడిగా తెలుగుచిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు . అయితే బాలీవుడ్ కెళ్లాలని మాత్రం పెద్దగా ఆశపడలేదు .

అయితే తాజాగా అలీ కి సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న దబాంగ్ 3 లో నటించే ఛాన్స్ లభించింది . దబాంగ్ సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ లు అయిన విషయం తెలిసిందే . దాంతో దబాంగ్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు కావడం గమనార్హం . ప్రభుదేవా దర్శకుడు కావడంతో అలీ కి సల్మాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది .