లీడర్ ఫోజులు తగ్గించు అలీ


Ali political imagination is too much on AP elections

1999 లో చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి ని చేసింది నేనే ! ఇప్పుడు 2019 లో జగన్ ని ముఖ్యమంత్రి ని చేస్తా అంటూ డప్పు కొడుతున్నాడు హాస్య నటుడు అలీ . టాలీవుడ్ నటుడైన అలీ ఇటీవలే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . అయితే అంతకుముందు చంద్రబాబు చుట్టూ , పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగాడు కట్ చేస్తే …… జగన్ పంచన చేరాడు . అయితే జగన్ పార్టీ టికెట్ ఇవ్వకుండా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చెయ్ ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడట దాంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నాడు అలీ .

 

అయితే రాజకీయ పార్టీలో ఎప్పుడైతే చేరాడో అప్పుడే పెద్ద నాయకుడిలా ఫోజు కొడుతున్నాడు అలీ . 1999 లో చంద్రబాబు ని ముఖ్యమంత్రి ని చేసింది నేనే ! అప్పుడు కూడా రాష్ట్రమంతటా ప్రచారం చేశాను , అలాగే ఓ సెంటిమెంట్ ని ఫాలో అయ్యాను . కట్ చేస్తే ఇప్పుడు కూడా 2019 లో జగన్ కోసం ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాను . తప్పకుండా జగన్ సీఎం అవుతాడు నేనే చేస్తాను అని పెద్ద ఫోజు కొడుతున్నాడు . ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎవరుండాలో అలీ చెప్పేటట్లైతే ఎన్నికలు ఎందుకు ? ప్రజల ఓట్లు ఎందుకు ? ఎంత నటుడైనా రాజకీయాల్లో చేరితే లీడర్ గా ఫోజు కొట్టొచ్చు కానీ మరీ ఇంత దారుణంగానా అలీ .

English Title : Ali political imagination is too much on AP elections

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Nithya Menen tight hugVijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star Vijayashanti