అలీ రెజా రీ ఎంట్రీ ఇచ్చి తప్పు చేశాడా?


Ali Reza targetting Baba Bhaskar in Bigg Boss
Ali Reza targetting Baba Bhaskar in Bigg Boss

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో అందరికంటే షాకింగ్ ఎలిమినేషన్ అంటే అలీ రెజాదే అని చెప్పుకోవచ్చు. అప్పటివరకూ ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్, కచ్చితంగా ఫైనల్ చేరుకుంటాడని ఆశించిన ప్రేక్షకులకు ఒక షాక్ గా మిగిలింది. అందుకే అలీని మళ్ళీ బిగ్ బాస్ హౌజ్ లోకి తిరిగి పంపమని కొంతమంది సోషల్ మీడియాలో అభ్యర్ధనలు కూడా చేసారు.

అయితే బిగ్ బాస్ యాజమాన్యం అలీ రెజా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తనను బిగ్ బాస్ లోకి పంపిస్తూనే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. బాబా భాస్కర్ ను టార్గెట్ చేయాలని ముందే చెప్పినట్టుంది. ఎప్పుడో రెండో వీక్ లో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి బాబా భాస్కర్ కు రెండు ముఖాలు ఉన్నాయని ప్రూవ్ చేసేలా మాట్లాడుతున్నాడు అలీ.

ఏదైనా టాస్క్ వచ్చినా కూడా అలీ టార్గెట్ క్లియర్ గా బాబానే అవుతున్నాడు. మిగతా ఇంటి సభ్యుల్లో కూడా బాబా పట్ల కొంత నెగటివిటీ వచ్చేలా అలీ ప్రయత్నించాడు. అయితే హుందాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన అలీ మాత్రం ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పూర్తిగా నెగటివ్ అవుతున్నాడు. బాబా భాస్కర్ కు సింపతీ వర్కౌట్ అవుతోంది.