అలియాకు నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న `ఆర్‌ఆర్ఆర్‌`!

alia bhat ready to ressume rrr
alia bhat ready to ressume rrr

బాలీవుడ్‌కు చెందిన సెల‌బ్రిటీలంతా సెకండ్ వేవ్ కార‌ణంగా కోవిడ్ బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే.  ఈ నెల ప్రారంభంలో బాలీవుడ్ నటి అలియా భట్ కోవిడ్ బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించి త‌ను స్వీయ నిర్భంధంలోకి వెళుతున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికి అలియా ఐసోలేష‌న్‌లోకి వెళ్లి 12 రోజుల‌వుతోంది. గ‌త 12 రోజులుగా డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్న ఆమె తాజాగా కోలుకుంది.

తాజాజ‌గా చేసిన కోవిడ్ టెస్ట్‌లో అలియాకు నెగెటివ్ అని వ‌చ్చింది. దీంతో అలియాతో పాటు ఆమెతో సినిమాలు చేస్తున్న వారంతా ఊప‌రి పీల్చుకున్నారు. `ఈ స‌మ‌యంలో నెగెటివ్‌గా వుండ‌టం మంచి విష‌యం` అని ఇన్‌స్టా వేదిక‌గా వెల్ల‌డించింది అలియాభ‌ట్‌. చెమ‌ట ప‌ట్టిన నీలిరంగు టీష‌ర్ట్ ధ‌రించి, పింక్ క‌ల‌ర్ ప్యాంట్‌లో వున్న ఓ ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది.

అలియా కోలుకోవ‌డంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్ల‌లో మునిగిపోయార‌ట‌. ఇప్ప‌టికే తాను కోలుకున్నాన‌ని, షూటింగ్‌లో పాల్గొంటాన‌ని అలియా `ఆర్ఆర్ఆర్‌` మేక‌ర్స్‌కి వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. దీంతో త‌దుప‌రి షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్ల‌లో టీమ్ మునిగిపోయింద‌ని తెలిసింది. `ఆర్ఆర్ఆర్‌`తో పాటు ‘గంగూబాయి కతియావాడి’, ‘బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో న‌టిస్తోంది.