అలియాభ‌ట్‌కు కోవిడ్ పాజిటివ్‌!

అలియాభ‌ట్‌కు కోవిడ్ పాజిటివ్‌!
అలియాభ‌ట్‌కు కోవిడ్ పాజిటివ్‌!

బాలీవుడ్ న‌టుల్లో క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇటీవ‌ల ప‌రేష్ రావ‌ల్ కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత `బ్ర‌హ్మాస్త్ర‌` షూటింగ్‌లో పాల్గొంటున్న ర‌ణ్‌బీర్‌క‌పూర్ కూడా ఇట‌వల కోవిడ్ బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌తో కాంటాక్ట్‌లో వున్న వారంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. ర‌ణ్‌బీర్‌తో క‌లిసి `బ్ర‌హ్మాస్త్ర‌`లో అలియాభ‌ట్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ర‌ణ్‌బీర్ కోవిడ్ బారిన ప‌డ‌టంతో హోమ్ క్వారెంటైన్‌కి ప‌ర‌నిమిత‌మైన అలియాభ‌ట్ గ‌త కొన్ని రోజులుగా ఇంటి ప‌ట్టునే వుంటోంది. తాజాగా ఆమెకు టెస్టులు నిర్వ‌హించ‌గా కోవిడ్ సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. ర‌ణ్‌బీర్ క‌పూర్ కోలుకున్న రెండు వారాల త‌రువాత అలియా కోవిడ్ బారిన ప‌డ‌టం గ‌మ‌నార్హం. దీంతో బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతుండ‌టం క‌ల‌వరానికి గురిచేస్తోంది.

అలియాభ‌ట్ `ఆర్ఆర్ఆర్‌`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఆమెకు సంబంధించిన షూటింగ్ ఇంకా జ‌ర‌గాల్సి వుంది. తాజాగా ఆమెకు కోవిడ్ సోక‌డంతో ఈ మూవీ షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అలియా కోలు కోవాలంటే రెండు వారాల‌కు మించి స‌మ‌యం ప‌డుతుంది.