ఆ ఇద్దరూ విడిపోయారా ?


రణ్ బీర్ కపూర్ - అలియా భట్
రణ్ బీర్ కపూర్ – అలియా భట్

అలియా భట్రణ్ బీర్ కపూర్ లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో స్పందించిన అలియా భట్ పెళ్లి గిల్లి జాన్తా నై అంటోంది . రణ్ బీర్ కపూర్ నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు , ఉన్నాడు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం ఇప్పట్లో లేదు అంటూ చెప్పుకొచ్చింది . దాంతో షాక్ అవ్వడం అందరి వంతు అవుతోంది .

రణ్ బీర్ కపూర్ వరుసగా ప్రియురాళ్ల ని మారుస్తూనే ఉన్నాడు , ఇప్పటికే ఆ లిస్ట్ లో బోలెడు మంది ఉన్నారు , అయితే ఆ లిస్ట్ లోకి అలియా భట్ వచ్చింది , ఇక పెళ్లి కావడమే తరువాయి అని వినిపించింది కట్ చేస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని అంటోంది . అంటే ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది దాంతో పెళ్లి గిల్లి జాన్తా నై అని అంటోంది . పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఇప్పుడేమో పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటోంది ఏంటో ?