షూటింగ్ లో హీరోయిన్ కు గాయాలు


alia bhatt injured in shootingహీరోయిన్ అలియా భట్ కు షూటింగ్ లో గాయాలయ్యాయి , దాంతో ఆమెని భారత్ కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ప్రస్తుతం అలియా భట్ బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటోంది , కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం బల్గెరియా లో షూటింగ్ జరుపుకుంటోంది . యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అలియా భట్ చేతికి గాయాలయ్యాయి .

ఆ గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో అలియా భట్ ని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు . డాక్టర్ల సలహా మేరకు అలియా భట్ విశ్రాంతి తీసుకోవడానికి ఇండియాకు వస్తోంది . అమితాబ్ బచ్చన్ , రణ్ బీర్ కపూర్ లు నటిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్ నటిస్తోంది . ఇక ఈ సినిమాని 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .