ఆర్ ఆర్ ఆర్ ను వేటాడుతున్న ఇబ్బందులు


alia bhatt
alia bhatt

సహజంగా ఇబ్బందులు వెంట పడుతుంటాయి , ఒక్క సమస్య వస్తే వరుసగా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మాత్రం సమస్యలు వేటాడుతున్నాయి . ఎందుకో తెలుసా …….. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రారంభించే సమయంలోనే రిలీజ్ డేట్ అంటూ అనౌన్స్ చేసారు . సహజంగా రాజమౌళి సినిమా అంటే ఒక పట్టానా కుదరదు దాన్ని చెక్కి చెక్కి తీయాల్సిందే .

అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి రిలీజ్ డేట్ ఎక్కడో ఉంది కదా ! కాబట్టి విడుదల అవుతుందిలే అని అనుకున్నారు కానీ తాజాగా మరో బాంబ్ పేలడంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవడం కష్టమే అని తెలుస్తోంది . ఇప్పటికే చరణ్ , ఎన్టీఆర్ లు గాయపడటం వల్ల రెండు నెలల పాటు షూటింగ్ వాయిదాపడింది . ఇక మళ్ళీ రెడీ అవుతున్నాం అని అనుకునే లోపు హీరోయిన్ అలియా భట్ పేగు ఇన్ఫెక్షన్ తో బాధపడుతోందని తెలుస్తోంది . చికిత్స కోసం అమెరికా వెళ్లిందట దాంతో తాజా షెడ్యూల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి .