ఆర్ఆర్ఆర్‌` కోసం అలియా ఆ ప‌ని చేస్తోందా?


alia bhatt sing a special song for rrr
alia bhatt sing a special song for rrr

రాజ‌మౌళి ఏది చేసిన ఇప్పుడు సంచ‌ల‌న‌మే.  ప్ర‌స్తుతం చేస్తున్న `ఆర్ఆర్ఆర్‌`పై దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇండియాన్ స్క్రీన్ పై నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆప్ట‌ర్ అనే స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ ఇందులో సీత‌గా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. కానీ ఇంత వ‌ర‌కు సెట్‌లోకి రాలేదు. న‌వంబ‌ర్ నుంచి అలియా `ఆర్ ఆర్ ఆర్‌` సెట్‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని కూడా టీమ్ పూర్తి చేసింది. ఈ వార‌మే అలియా హైద‌రాబాద్ రాబోతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ల‌తో పాటు అలియా పాల్గొన‌గా రాజ‌మౌళి కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.

సైద్ధాంతిక ప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో అలియా పాత్ర వుంటుంద‌ని, ఆమెపై ఓ పాట‌ని కూడా షూట్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. అయితే ఈ పాట‌ని స్వ‌యంగా అలియానే ఆల‌పించ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలుగు రాని అలియా పాట ఎలా పాడ‌బోతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.