రామ‌రాజు రాక‌కోసం నిరీక్షిస్తున్న సీత‌!

రామ‌రాజు రాక‌కోసం నిరీక్షిస్తున్న సీత‌!
రామ‌రాజు రాక‌కోసం నిరీక్షిస్తున్న సీత‌!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే.

ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ నటిస్తున్న విష‌యం తెలిసిందే. అత‌నికి జోడీగా సీత పాత్ర‌లో అలియా న‌టిస్తోంది. సోమ‌వారం అలియాభ‌ట్ పుట్టినరోజు సంద‌ర్భంగా అలియా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. `రామ‌రాజు రాక‌ కోసం బ‌ల‌మైన సంక‌ల్పంతో సీత వేచి చూస్తోంది. ఆమె ఎదురుచూపులు ఎంతో గొప్ప‌వి` అని `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ట్వీట్ చేసింది.

ఇదిగో నా సీత‌. దృఢ సంక‌ల్పం వున్న స్త్రీ. అంటూ అలియాకు రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని అక్టోబ‌ర్ 13న ద‌స‌రా కానుక‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల్ని చిత్ర బృందం చిత్రీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే.