`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిచ్చిన భామ‌!


`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిచ్చిన భామ‌!
`ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి షాకిచ్చిన భామ‌!

ద‌ర్శ‌‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌` గోండు బెబ్బులి కొమ‌రం భీంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌న్యం పులి అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందుకు త‌గ్గ‌ట్టే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో అబ్బుర ప‌రిచే స‌న్నివేశాల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా రోమాంచిత ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్ర రిలీజ్‌కు సంబంధించి గ‌త కొన్ని రోజులుగా హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఈ ఏడాది ద‌స‌రా సెల‌వుల్లో లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీలో న‌టిస్తున్న హాలీవుడ్ న‌టి అలీస‌న్ డూడీ `ఆర్ఆర్ఆర్‌`రిలీజ్ డేట్‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి రాజ‌మౌళితో పాటు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారంటూ అలీస‌న్ డూడీ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై రాజ‌మౌళి ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి.