కరోనా ఎఫెక్ట్ – మార్చ్ 31 వరకూ అన్నీ బంద్


All close up to march31st due to corona virus
All close up to march31st due to corona virus

రాష్ట్ర పభుత్వాలు ఎగతాళి చేసినంత సేపు పట్టలేదు.. దేశంలో కరోనా వైరస్ కోవిడ్ 19 పాజిటివ్ గా నమోదు అయిన వాళ్ళలో కొంతమంది చనిపోవడంతో ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. మార్చ్31 వతేదీ వరకూ అన్ని స్కూల్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ మూసివెయ్యాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 84 కేసులు కరోనా వైరస్ పాజిటివ్ గా నమోదు కాగా, వారిలో ఇద్దరు మరణించారు. దీనితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి వచ్చిన వారిని సుమారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించి వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.

వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోయినా… 15 రోజులపాటు వారిని ఇంటిలో ఉండేలా, చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇప్పటికే అనేకరకాల వదంతులు వ్యాప్తి చేస్తున్న వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వ వర్గాలు తెలియచేసారు. ఇప్పటికే రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలతో మొదలెట్టి, అవుట్ డోర్, ఫారిన్ షెడ్యూల్స్ కూడా వాయిదా వేసుకున్నారు.