ఇండ‌స్ట్రీ పెద్ద‌ల క‌ళ్ల‌న్నీ మ‌హేష్‌పైనే!


ఇండ‌స్ట్రీ పెద్ద‌ల క‌ళ్ల‌న్నీ మ‌హేష్‌పైనే!
ఇండ‌స్ట్రీ పెద్ద‌ల క‌ళ్ల‌న్నీ మ‌హేష్‌పైనే!

2018 నుంచి ఈ ఏడాది ప్రారంభం వ‌ర‌కు మ‌హేష్ వ‌రుస‌గా మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌న‌నున్నా చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త త‌ర‌హా క‌థాక‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని దర్శ‌కుడు ప‌ర‌శురామ్ తెర‌కెక్కించ‌డానికి స‌ర్వం సిద్ధం చేశారు.

జూన్ మొద‌టి వారం నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని ఈ నెల 31న లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని అనుకున్నారు. లాక్‌డౌన్ ముగుస్తున్న వేళ ప్రారంభం కానున్న సినిమా కావ‌డంతో ఈ చిత్ర ప్రారంభోత్స‌వం కోసం మ‌హేష్ ఫ్యాన్స్‌ని మించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని తెలిసింది.

ఈ నెల 31న సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ప్ర‌తీ ఏడాదీ త‌న సినిమాల‌కు సంబంధించిన కొత్త విష‌యాల్ని ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజైన ఈ నెల 31న మ‌హేష్ కొత్త చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఇదే రోజు టైటిల్‌ని, కీల‌క విష‌యాల్ని చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి `స‌ర్కారు వారి పాట‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే.