ఎట్టకేలకు రాహుల్, శ్రీముఖి కలిశారుగా


ఎట్టకేలకు రాహుల్, శ్రీముఖి కలిశారుగా
ఎట్టకేలకు రాహుల్, శ్రీముఖి కలిశారుగా

బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులకు కనువిందు చేసింది, అలరించింది అనడానికి ప్రధాన కారణాలు శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ అని చెప్పాలి. శ్రీముఖి తన యాక్టివ్ నెస్ తో, రాహుల్ తన సింగింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే ఈ ఇద్దరూ హౌజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి రిలేషన్ మైంటైన్ చేసారో అందరికీ తెల్సిందే. పలు సందర్భాల్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. శ్రీముఖి అయితే రాహుల్ ను నిన్ను హౌజ్ లో ఉన్నంత కాలం నామినేట్ చేస్తూనే ఉంటా అని అంది. దానికి తగ్గట్లే కొన్ని వారాలు అతణ్ని నామినేట్ చేస్తూ వచ్చింది. రాహుల్ పై ప్రజల్లో సింపతీ పెరగడానికి శ్రీముఖి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే రాహుల్ కూడా శ్రీముఖిని పలుమార్లు తిట్టడం, పరుష పదజాలం వాడటం అందరూ చూసారు. సీజన్ ఆఖరి నుండి రెండో వారంలో వచ్చిన నంబర్స్ టాస్క్ లో శ్రీముఖి, రాహుల్ ఒకరిపై ఒకరు ఎన్నేసి నిందలు వేసుకున్నారో అందరం చూసాం. దాని తర్వాత నుండి ఇద్దరి మధ్యా మాటలు లేవు.

శ్రీముఖి వాళ్ళ అమ్మ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఇద్దరినీ కొట్టుకోవద్దని, ఒకరిని ఒకరు తిట్టుకుంటే చూసే వాళ్లకు కూడా అంత బాగోదు అంటూ వ్యాఖ్యానించారు అంటే పరిస్థితి ఎంత దాకా వెళ్లిందో చూడొచ్చు. అయితే ఏమైందో కానీ బిగ్ బాస్ ఫైనల్స్ మాత్రం ఇద్దరూ తమ మధ్య ఉన్న విబేధాల్ని పక్కపెట్టి ఆడారు. ఫైనల్స్ లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా, శ్రీముఖి రన్నరప్ అయింది. బిగ్ బాస్ అయ్యాక రాహుల్ ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడిపాడు. శ్రీముఖి మాత్రం హాలిడేస్ ఎంజాయ్ చేసి మళ్ళీ తన వర్క్ లో పడిపోయింది. ఇటీవలే రాహుల్ మీడియా ముఖంగా మాట్లాడుతూ అసలు శ్రీముఖి అందుబాటులో లేదని, ఆమెకు ఫోన్ చేసినా ఎవరో ఎత్తుతున్నారని, అసలు ఆమె దాకా ఫోన్ వెళ్లట్లేదని, ఆమె కావాలనే ఇదంతా చేస్తూ ఉండుండొచ్చు అని వ్యాఖ్యానించాడు.

దీంతో షో అయిపోయాక ఇద్దరి మధ్యా అగాధం అలాగే ఉందని అందరూ అనుకున్నారు. అయితే రీసెంట్ గా ఇద్దరూ కలిసినట్లు వితిక సోషల్ మీడియాలో ఫోటో పెట్టింది. ఒక వీడియో కూడా జత చేసింది. అందులో వితిక, వరుణ్, రాహుల్, శ్రీముఖి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే రాహుల్, శ్రీముఖి విడిగా డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. బిగ్ బాస్ కు రాక ముందు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నది తెల్సిందే. అయితే బిగ్ బాస్ లో పరిస్థితుల వల్ల ఇద్దరూ అలా ప్రవర్తించి ఉంటారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక శ్రీముఖి కూడా కొత్త రిలేషన్ షిప్ మొదలైంది అంటూ రాహుల్ తో తాను ఉన్న ఫోటోను షేర్ చేసింది. అలాగే రాహుల్ కూడా శ్రీముఖితో తాను కలిసి ఉన్న ఫోటోను చాలా ఆనందంగా షేర్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా మళ్ళీ పాత స్నేహం చిగురించింది అనుకోవచ్చా.

 

View this post on Instagram

 

Gatham! Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

Credit: Instagram