అడ్డంకుల‌న్నీ క్లియ‌ర్.. `క్రాక్‌` ఫ‌స్ట్ షోకి రెడీ!


అడ్డంకుల‌న్నీ క్లియ‌ర్.. `క్రాక్‌` ఫ‌స్ట్ షోకి రెడీ!
అడ్డంకుల‌న్నీ క్లియ‌ర్.. `క్రాక్‌` ఫ‌స్ట్ షోకి రెడీ!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మాసీవ్ ‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని స్ర‌వంతి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మించిన విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. కానీ రాలేదు. ఫైనాన్స్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ఉద‌యం నుంచి ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది.

నిర్మాత ఠాగూర్ మ‌ధు ఇటీవ‌ల చేసిన చిత్రాలు ఫ్లాప్ కావ‌డం, పైనాన్షియ‌ర్‌ల‌కు 10 కోట్ల మేర బ‌కాయిలు ప‌డ‌టంతో చివ‌రి నిమిషంలో ఆ అప్పు తీర్చితే గానీ `క్రాక్‌` రిలీజ్ కుద‌ర‌ద‌ని ఫైనాన్షియ‌ర్‌లు అడ్డుకున్నారు. దీంతో ఈ మూవీ రిలీజ్ ఉద‌యం నుంచి ఊగిసలాడుతూ వ‌చ్చింది. ఫైనాన్షియ‌ర్‌ల‌కు ఎంత మంది సినీ పెద్ద‌లు న‌చ్చ జెప్పే ప్ర‌య‌త్నం చేసినా విన‌క‌పోవ‌డంతో ఉద‌యం ఆట ప‌డ‌కుండానే  ఆగిపోయింది.

తాజాగా ఈ చిత్ర రిలీజ్‌కు అన్ని అడ్డంకులు తొల‌గిపోయాయ‌ని, చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని, ఫ‌స్ట్ షో నుంచి ఈ మూవీ షోస్ థియేట‌ర్ల‌లో ర‌న్న‌వుతాయ‌ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో ర‌వితేజ అభిమానుల‌తో పాటు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.