ఆ ఇద్దరూ సక్సెస్ కొడతారా ?


అల్లరి నరేష్
అల్లరి నరేష్

హీరోగా అల్లరి నరేష్ కు హిట్ అన్నది తెలియక ఏడేళ్లు అలాగే దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి కి కూడా హిట్ లేక చాలాకాలం అవుతోంది . అంతేకాదు తనని డైరెక్టర్ గా నిలబెట్టిన యమలోకం చిత్రానికి సీక్వెల్ గా యమలోకం 2 అనే సినిమా తీసి నవ్వుల పాలయ్యాడు ఎస్వీ కృష్ణారెడ్డి . కట్ చేస్తే చాలా సంవత్సరాలుగా హిట్ అన్నదే లేని అల్లరి నరేష్ – ఎస్వీ కృష్ణారెడ్డి లు కలిసి ఓ సినిమా చేయడానికి సమాయత్తం అవుతున్నారు .

అయితే ఈ ఇద్దరూ కలిసి సక్సెస్ కొడతారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . అల్లరి నరేష్ హిట్ కోసం పోరాడి పోరాడి అలిసిపోయి మహేష్ బాబు మహర్షి సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు . ఇక ఎస్వీ కృష్ణారెడ్డి మళ్ళీ మెగా ఫోన్ చేతబట్టి యాక్షన్ , కట్ చెప్పాలని చూస్తున్నాడు . జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్లుగా ఈ ఇద్దరూ కలిసి చేసే సినిమా హిట్ అవుతుందా ? లేక మరో డిజాస్టర్ అవుతుందా ? చూడాలి .