పాపం ! అల్లరి నరేష్


Allari naresh another flop అల్లరి నరేష్ కు టైం అస్సలు బాగోలేనట్లు ఉంది గతకొంత కాలంగా చేస్తున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి . 2012 లో వచ్చిన సుడిగాడు మాత్రమే అల్లరి నరేష్ చివరి హిట్ చిత్రం పైగా నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అది దాని తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా హిట్ కాలేదు సరిగ్గా చెప్పాలంటే ఆరేళ్ళుగా అల్లరి నరేష్ కు హిట్ అన్నది ఎలా ఉంటుందో తెలియదు . సుడిగాడు చిత్రం తర్వాత అల్లరి నరేష్ ఇప్పటి వరకు 13 సినిమాలు చేసాడు అవన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి రావడం ఫ్లాప్ అవ్వడం జరిగింది .

అయితే తాజాగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సిల్లీ ఫెలోస్ చిత్రం పై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . తనకు సుడిగాడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడంతో సిల్లీ ఫెలోస్ తప్పకుండా హిట్ అవుతుందని తన జాతకం మార్చేస్తుందని అనుకున్నాడు కట్ చేస్తే నిన్న విడుదలైన సిల్లీ ఫెలోస్ కు జనాలు లేక థియేటర్ లన్ని వెలవెలబోతున్నాయి . ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో షాక్ అయ్యాడట !

English Title: allari naresh another flop