అల్ల‌రి న‌రేష్ `బ్రీత్ ఆఫ్ నాంది`!

అల్ల‌రి న‌రేష్ `బ్రీత్ ఆఫ్ నాంది`!
అల్ల‌రి న‌రేష్ `బ్రీత్ ఆఫ్ నాంది`!

అల్ల‌రి న‌రేష్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం `నేను`. సైకో ప్రేమికుడిగా అల్ల‌రి న‌రేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఔరా అనిపించింది. ఆ త‌రువాత మ‌ళ్లీ అలాంటి క‌థ కానీ, పాత్ర కానీ మూవీ కానీ అల్ల‌రి న‌రేష్ నుంచి రాలేదు. చాలా ఏళ్ల త‌రువాత న‌రేష్‌లోని న‌టుడిని మ‌రో సారి పూర్తి స్థాయిలో ఆవిష్క‌రిస్తున్న చిత్రం `నాంది`. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ ఈ చిత్ర టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన `బ్రీత్ ఆఫ్ నాంది`ని రిలీజ్ చేశారు. `15 ల‌క్ష‌ల మంది ప్రాణ త్యాగం చేసుకుంటే కాన‌పీ మ‌న దేశానికి స్వాతంత్య్రం రాలేదు. 1300 మంది ఆత్మబ‌లిదానం చేసుకుంటే కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్ప‌డ‌లేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సంద‌ర్భం చ‌రిత్ర‌లోనే లేదు. నా ప్రాణం పోయినా ప‌ర‌వాలేదు న్యాయం గెల‌వాలి. న్యాయ‌మే గెల‌వాలి` అంటూ టీజ‌ర్‌లో అల్ల‌రి న‌రేష్ చెబుతున్న డైలాగ్‌లు ఈ మూవీపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. శిక్ష ప‌డిన ట్రయ‌ల్ ఖైదీగా ఇందులో అల్ల‌రి న‌రేష్ క‌నిపిస్తున్నారు.

ఐర‌న్ పోల్‌పై అల్ల‌రి న‌రేష్ న‌గ్నంగా వెల్ల‌కిలా ప‌డుకుని వున్న సీన్ సినిమా ఏ రేంజ్ వుండ‌బోతోందో తెలియ‌జేస్తోంది. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్‌, దేవి ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.