విలన్ గా మారుతున్న అల్లరి నరేష్ అన్న


allari naresh brother aryan rajesh turned villain

హీరోగా పరిచయమైన అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ తాజాగా విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది . ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరున్న జగపతిబాబు ని విలన్ గా చూపించి అతడికి బ్రేక్ నిచ్చాడు దర్శకులు బోయపాటి శ్రీను కట్ చేస్తే ఇప్పుడు జగపతిబాబు విపరీతమైన డిమాండ్ ఉన్న నటుడు అయ్యాడు ఇక ఇప్పుడేమో ఆర్యన్ రాజేష్ ని విలన్ గా చూపించడానికి సన్నాహాలు చేస్తున్నాడట దర్శకులు బోయపాటి శ్రీను . ప్రస్తుతం చరణ్ హీరోగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు .

కాగా ఆ చిత్రంలో రెండో విలన్ గా ఆర్యన్ రాజేష్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట బోయపాటి . హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆర్యన్ రాజేష్ కు అంతగా కాలం కలిసి రాలేదు దాంతో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి ఇక ఒకటి అరా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మాత్రం ఇతడికి దక్కలేదు పాపం దాంతో సినిమాలు లేక కెరీర్ దాదాపుగా అయిపొయింది అని అనుకుంటున్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో విలన్ అంటే పంట పండినట్లే ! అయితే బోయపాటి ఆఫర్ కు ఆర్యన్ ఎలా స్పందిస్తాడు ? ఒకవేళ చేసినా సక్సెస్ అవుతాడా ? అన్నది చూడాలి .

English Title: allari naresh brother aryan rajesh turned villain