అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం


ఇటీవలే మహర్షి చిత్రంలో నటించి మరోసారి హిట్ బాట పట్టిన అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది . అల్లరి నరేష్ నాయనమ్మ , స్వర్గీయ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ తల్లి ఈదర వెంకట రత్నమ్మ (87) సోమవారం మరణించారు . ఈవీవీ సత్యనారాయణ తల్లి వెంకట రత్నమ్మ కొంత కాలంగా కోరుమామిడి లో ఉంటోంది అయితే నిన్న మరణించడంతో అల్లరి నరేష్ కుటుంబం విషాదంలో మునిగింది .

వెంకట రత్నమ్మ అంత్యక్రియలు కోరుమామిడిలో నిర్వహించారు అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ లు . నాయనమ్మ మృతితో అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ లు కన్నీళ్ల పర్యంతం అయ్యారు . టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులుగా రాణించిన ఈవీవీ సత్యనారాయణ పిల్లలే ఈ అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ లు . తండ్రి మరణం తర్వాత అల్లరి నరేష్ కు సక్సెస్ లేకుండా పోయింది . ఇటీవలే మహర్షి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు అల్లరి నరేష్ .