కామెడీ నుండి షాకింగ్ అవతారంలోకి అల్లరి నరేష్


కామెడీ నుండి షాకింగ్ అవతారంలోకి అల్లరి నరేష్
కామెడీ నుండి షాకింగ్ అవతారంలోకి అల్లరి నరేష్

కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చుకున్నాడు. కామెడీ ఎంటెర్టైనర్లతో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం, తాను హీరోగా చేసిన సినిమాలు వరసగా ప్లాపులు కావడం వీటికి కారణాలు కావొచ్చు. ఏదేమైనా అల్లరి నరేష్ ప్రస్తుతం మొదలుపెట్టబోతున్న సినిమా హాట్ టాపిక్ మారింది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ తోనే ఆసక్తి కలిగించిన అల్లరి నరేష్ ఇప్పుడు కొత్త లుక్ లోకి మారిపోయి సంచలనం సృష్టించాడు. నాంది అనే పేరుతో తెరకెక్కబోయే ఈ కొత్త చిత్రం కొద్ది సేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది.

ఒంటిపై నూలు పోగు అనేది లేకుండా తలక్రిందులుగా వేలాడుతున్న అల్లరి నరేష్ ఫోటోను ఫస్ట్ లుక్ గా విడుదల చేసారు. ఈ చిత్రానికి నాంది అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. టైటిల్ తో పాటు ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

అల్లరి నరేష్ ఇటీవలే మహర్షి చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఆ రోల్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నాంది చిత్రంలో హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఈ చిత్రం కంటే ముందే అల్లరి నరేష్ బంగారు బుల్లోడు అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరిన్ని విభిన్నమైన పాత్రల కోసం చూస్తున్నాడు అల్లరి నరేష్.