`నాంది` ముందు వేరే హీరోకి వెళ్లిందా?

 

allari naresh not the first choice for naandhi
allari naresh not the first choice for naandhi

అల్ల‌రి న‌రేష్ న‌టించిన చిత్రం `నాంది`. ఈ మూవీ ద్వారా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. వేగేశ్న స‌తీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తొలి షోకే మంచి టాక్‌ని సొంతం చేసుకుని న‌రేష్ కెరీర్‌లో ఎనిమిదేళ్ల త‌రువాత భారీ విజ‌యాన్ని అందించింది. హీరో న‌రేష్ కెరీర్‌కి స‌రికొత్త దారిని నిర్దేశించింది.

ఈ మూవీ విజ‌యంతో న‌రేష్ ఎనిమిదేళ్ల త‌రువాత మ‌ళ్లీ స‌క్సెస్ చూశాన‌ని శుక్ర‌వారం భావోద్వేగానికి గుర‌య్యారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మూవీ ముందు అల్ల‌రి న‌రేష్ ద‌గ్గ‌రికి రాలేద‌ని, ముందు వేరే హీరోని అనుకున్నార‌ని, ఆ హీరో ఇందులో న‌టించ‌లేన‌ని తిర‌స్క‌రించ‌డంతో మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ అల్ల‌రి న‌రేష్‌ని సంప్ర‌దించార‌ని చెబుతున్నారు.

అయితే ఈ మూవీని తిర‌స్క‌రించిన హీరో మ‌రెవ‌రో కాదు శ‌ర్వానంద్ అట‌. త‌ను ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డంతో ఈ క‌థ‌ని అల్ల‌రి న‌రేష్ వ‌ద్ద‌కు తీసుకెళ్లార‌ని, న‌రేష్ వెంట‌నే అంగీక‌రించి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. త‌రువాత జ‌రిగింది తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ  చిత్రంలో న‌టించినందుకు న‌రేష్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.