అల్లరి నరేష్ కెరీర్ ఇప్పుడైనా గాడిలో పడుతుందా ?


Allari Naresh
Allari Naresh

అల్లరి నరేష్ కు తాజాగా మహర్షి రూపంలో మంచి ఛాన్స్ వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు దాంతో అల్లరి నరేష్ పై ప్రశంసలు కురుస్తున్నాయి . ఈ కామెడీ హీరోకు గత ఏడేళ్లుగా హిట్ లేదు , చివరి హిట్ సినిమా ” సుడిగాడు ” . పాపం ! ఆ సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ కు సుడి లేకుండాపోయింది . దాంతో అప్పటి నుండి హిట్స్ కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తూనే ఉన్నాడు . ఇన్నాళ్లకు మహేష్ బాబు రూపంలో మహర్షి వచ్చింది .

అల్లరి నరేష్ నటుడిగా ఫెయిల్ కాలేదు కానీ నవ్వించడంలో మాత్రం విఫలమయ్యాడు . ఐదారేళ్ళ క్రితం ఉన్న సమాజం వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు దాంతో అల్లరి నరేష్ ఇచ్చే కామెడీ అంతగా జనాలకు నచ్చలేదు అందుకే రేసులో లేకుండాపోయాడు . అలాగే స్టార్ డం ఉన్నపుడు కాస్త చూసుకోవాలి కానీ అప్పుడు పెద్దగా లక్ష్య పెట్టలేదు …… దెబ్బతిన్నాడు ఇక ఇప్పుడు మళ్ళీ మహర్షి చిత్రంతో మంచి పేరొచ్చింది కాబట్టి ఇకనైనా జాగ్రత్తపడితే తప్పకుండా అల్లరి నరేష్ కెరీర్ గాడిలో పడుతుంది లేదంటే షరా మాములే !