అభిమన్యుడు ని మెచ్చుకున్న అల్లరి నరేష్


allari naresh praises vishal abhimanyudu

అల్లరి నరేష్ కు అభిమన్యుడు సినిమా చాలా బాగా నచ్చిందట దాంతో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసాడు . విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు చిత్రంలో సమంత కథానాయిక కాగా కీలక పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటించాడు . సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన అభిమన్యుడు చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . తమిళంలో ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది , ఇంకా మంచి కలెక్షన్లతో రన్ అవుతోంది ” ఇరుంబు తిరై ” .

డిజిటల్ ఇండియా నేపథ్యంలో సాగే మోసాల నేపథ్యంలో రూపొందిన అభిమన్యుడు చిత్రం నిన్న తెలుగులో విడుదల అయ్యింది . ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు అందునా నాగార్జున లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ విశాల్ అభిమన్యుడు చిత్రానికే అగ్ర తాంబూలం కట్టబెట్టారు ప్రేక్షకులు . విశాల్ , అర్జున్ ల నటన ను పొగడ్తలతో ముంచెత్తాడు అల్లరి నరేష్ . గతకొంత కాలంగా అల్లరి నరేష్ కు సరైన హిట్ లేదు దాంతో ఆ విజయం ఎలాంటి బూస్ట్ ఇస్తుందో బాగా తెలుసు కాబట్టి సక్సెస్ అయిన విశాల్ కు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ అల్లరి హీరో .