బ్యాడ్ హ్యాబిట్ ని వదిలేసానంటున్న అల్లరి నరేష్


Allari Naresh says I  given up my bad habit
Allari Naresh says I given up my bad habit

నేను షూటింగ్ లకు ఆలస్యంగా వస్తాననే చెడ్డ పేరుంది , అయితే ఇప్పుడు ఆ చెడ్డ పేరు తుడిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ బ్యాడ్ హ్యాబిట్ ని వదిలేసానని అంటున్నాడు హీరో  అల్లరి నరేష్ . సరైన సమయానికి షూటింగ్ కు రాకుండా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుంటాడని అల్లరి నరేష్ కు బ్యాడ్ నేమ్ ఉంది . అయితే సక్సెస్ లో ఉన్నప్పుడు అల్లరి నరేష్ ని భరించారు .

ఎప్పుడైతే అల్లరి నరేష్ కు వరుస ప్లాప్ లు వచ్చాయో ఇక అతడితో సినిమాలు చేయడం మానేశారు . అయితే ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రంలో మంచి పాత్ర పోషించాడు . ఆ పాత్ర అల్లరి నరేష్ కు మంచి ఇమేజ్ తీసుకొచ్చింది . అయితే అల్లరి నరేష్ మారడానికి కారణం తండ్రి ఈ వివి సత్యనారాయణ కారణం అట ! ఆయన బ్రతికున్నపుడు దర్శక నిర్మాతల ఇబ్బందులు ఏంటి ? అన్నది వివరించి చెప్పాడట ! దాంతో తాను మారాలని నిర్ణయించుకున్నాడట అల్లరి నరేష్ .