సక్సెస్ కోసం రూట్ మార్చిన హీరో


Allari naresh in serious role

అల్లరి నరేష్ సక్సెస్ కోసం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాడు పాపం . ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు అల్లరి నరేష్ . అయితే గత ఆరేళ్లుగా అల్లరి నరేష్ కు హిట్ అనేదే లేకుండాపోయింది . చేస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు అందుకుంటుండటంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి జంకుతున్నారు దర్శక నిర్మాతలు దాంతో అల్లరి నరేష్ కు సినిమాలు లేకుండాపోయాయి .

 

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు అల్లరి నరేష్ . ఆ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది . ఇక తాజాగా సత్తిబాబు దర్శకత్వంలో సీరియస్ గా సాగే చిత్రంలో నటించడానికి అంగీకరించాడట ఈ హీరో . సత్తిబాబు తో అల్లరి నరేష్  చేసిన సినిమాలు హిట్ కావడంతో ఈ  సినిమాపై కాస్త అంచనాలు ఉండొచ్చు . సక్సెస్ కోసం అహర్షలు కష్టపడుతున్న ఈ హీరో ఇప్పుడు రూట్ మార్చాడు , మరి ఇప్పుడైనా హిట్ కొడతాడా ? చూడాలి .

English Title: Allari naresh in serious role