మహేష్ నిర్మాతపై అలిగిన అల్లరి నరేష్


allari naresh
allari naresh

ఈ ఏడాది అల్లరి నరేష్ రూట్ మార్చి మహర్షి సినిమాలో మంచి రోల్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తన కెరీర్ స్టార్టింగ్ నుండి క్యారెక్టర్ రోల్స్ వేయడం అలవాటున్న అల్లరి నరేష్, హీరోగానూ కొనసాగుతున్నాడు. అలాగే మహర్షి తర్వాత అనిల్ సుంకర నిర్మాణంలో కల్యాణరాముడు అనే చిత్రాన్ని చేస్తున్నాడు అల్లరి నరేష్.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ ఆలస్యమైంది. మరో నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ షూట్ పూర్తి చేయాల్సి ఉంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. అయితే ఇవేం చేయకుండా ప్రొడక్షన్ యూనిట్ మొత్తం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంపైనే దృష్టి కేంద్రీకరించడంపై అల్లరి నరేష్ అలిగాడట.

తనని ఇలా విస్మరించడంపై యూనిట్ సభ్యుల దగ్గరే వాపోయినట్లు సమాచారం. ఈ విషయం అనిల్ సుంకర వరకూ వెళ్లి, ఆయన దిద్దుబాటు చర్యలకు దిగాడట. త్వరలోనే ప్యాచ్ వర్క్ కు సంబందించిన షెడ్యూల్ వేసి షూట్ పూర్తి చేసి, దీపావళికి చిత్రాన్ని విడుదల చేస్తానని అనిల్ సుంకర ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది.