రాజ్ తరుణ్ కేసులో బెదిరింపులు


Allegations on Hero Raj tarun and Raja raveendra
Allegations on Hero Raj tarun and Raja raveendra

యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు పలు ట్విస్ట్ లతో సాగుతోంది . కారు యాక్సిడెంట్ అయి మూడు రోజులైనా అంతులేని కథలా సాగుతోంది . రకరకాల ట్విస్ట్ లతో సీరియల్ లా ని తలపిస్తోంది అంతేకాదు ట్విస్ట్ లతో ఉత్కంఠ రేపుతోంది . నార్సింగ్ సర్కిల్లో కారు యాక్సిడెంట్ చేసి పారిపోతున్న రాజ్ తరుణ్ ని కార్తీక్ అనే యువకుడు పట్టుకున్నాడట ! అయితే ఆ సమయంలో రాజ్ తరుణ్ మద్యం మత్తులో ఉన్నాడని అంటున్నాడు కార్తీక్ , అంతేకాదు రాజ్ తరుణ్ పరుగెత్తుతున్న విజువల్స్ ఇవ్వాల్సిందిగా బెదిరింపులు కూడా చేస్తున్నారట .

దాంతో కార్తీక్ అసలు విషయాన్ని వెలుగులోకి తెస్తున్నాడు . ఇక కార్తీక్ ని బెదిరించింది రాజ్ తరుణ్ మేనేజర్ అయిన రాజా రవీంద్ర అని అతడి పేరు ప్రకటించాడు . రాజా రవీంద్ర నటుడు కూడా . రాజ్ తరుణ్ కానీ రాజా రవీంద్ర కానీ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి .