‘అల’ స్పెషల్ షో అలా చూసేసారు!


'అల' స్పెషల్ షో అలా చూసేసారు!
‘అల’ స్పెషల్ షో అలా చూసేసారు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్, కలర్ కరెక్షన్ వంటి పనులు జరుగుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఇవి పూర్తైపోయి ఫైనల్ కాపీ పూర్తైపోతుందని అంటున్నారు. అయితే ఇంకా ఫైనల్ కాపీ కూడా పూర్తవకుండానే అల్లు ఫ్యామిలీ అల వైకుంఠపురములో చిత్రాన్ని చూసేశారట. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ ఈ మేరకు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ మాత్రం హల్చల్ చేస్తోంది.

అల వైకుంఠపురములో చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మెయిన్ బ్యానర్ అయినా కానీ అల్లు అరవింద్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన సినిమాల వరకూ అల్లు అరవింద్ కు ఒక సెంటిమెంట్ ఉందిట. రిలీజ్ కు ముందే అల్లు ఫ్యామిలీకి సినిమాను చూపించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాడట. ఒకవేళ వాళ్ళ దగ్గరనుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే ఇక అల్లు అరవింద్ ఫుల్ రిలాక్స్ అయిపోతాడట. చాలా సినిమాలకు ఫ్యామిలీ ఫీడ్ బ్యాక్ సరిగ్గా వర్కౌట్ అయిందట. అందుకే ఇప్పుడు ఫైనల్ కాపీ పూర్తి కాకపోయినా రఫ్ వెర్షన్ నే అల్లు ఫ్యామిలీ వీక్షించారట. సినిమా పట్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బన్నీనీ సినిమాలో ప్రెజంట్ చేసిన తీరుపై వారు హర్షం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఈ వార్తను షేర్ చేసుకుంటున్నారు. ఇది పక్కన పెడితే అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ జనవరి 6న జరగనున్న విషయం తెల్సిందే. ఈ రోజే సినిమా ఆల్బమ్ లో సూపర్ హిట్ సాంగ్ సామజవరగమన వీడియో ప్రోమో విడుదల చేయగా దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియో పరంగానే కాకుండా వీడియోగానూ ఈ పాట రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెల్సిందే.